ధోనీ టెస్టులను వీడాల్సింది కాదు: సునీల్‌ గవాస్కర్‌

     Written by : smtv Desk | Wed, Jan 17, 2018, 04:43 PM

ధోనీ టెస్టులను వీడాల్సింది కాదు:  సునీల్‌ గవాస్కర్‌

న్యూ డిల్లీ, జనవరి 17: భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టెస్టులను వీడకుండా ఉండాల్సిందని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. సన్నీ ఈ కామెంట్‌ చేయడానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే సఫారీ గడ్డపై వికెట్‌ కీపర్ల వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణం. సాహా గాయపడటంతో సెంచూరియన్‌లో జరుగుతూన్న రెండో టెస్టులో వికెట్‌ కీపర్‌గా పార్ధీవ్‌ పటేల్‌కు జట్టులో చోటు కల్పించాడు కోహ్లీ. కానీ, పార్ధీవ్‌ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమై విమర్శల పాలయ్యాడు.

రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ ఎల్గర్‌(61)క్యాచ్‌తో పాటు మొదటి ఇన్నింగ్స్‌లో ఆమ్లా(82), డూప్లిసిస్‌(63) క్యాచ్‌లను చేజార్చాడు. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ గురించి సన్నీ స్పందించారు. 'టెస్టుల్లో కెప్టెన్సీ భారం అతనిపై అధికంగా పడి ఉంటుందని నేను భావిస్తున్నాను. కెప్టెన్‌ బాధ్యతలను వదులుకొని వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగితే బాగుండేది. ఎందుకంటే డ్రస్సింగ్‌ రూమ్‌, మైదానంలో అతని సలహాలు, సూచనలు ఆటగాళ్లకు ఎంతో విలువైనవి' అని సన్నీ పేర్కొన్నాడు.





Untitled Document
Advertisements