ఇర్గిజ్‌ జిల్లాలో బస్సు ప్రమాదం : 52 మంది మృతి

     Written by : smtv Desk | Thu, Jan 18, 2018, 05:31 PM

 ఇర్గిజ్‌ జిల్లాలో బస్సు ప్రమాదం : 52 మంది మృతి

ఇర్గిజ్‌, జనవరి 18 : కజికిస్థాన్‌‌లోని స్థానిక ఇర్గిజ్‌ జిల్లాలో ఈ రోజు ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 52 మంది మృత్యువాతపడ్డారు. దీంతో వెంటనే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అయితే, ఈ ప్రమాదం నుంచి ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు. కాగా, బాధితులందరూ ఉజ్బెకిస్థాన్‌కు చెందిన వారిగా సమాచారం. వీరింతా రష్యా నుంచి వస్తున్నట్లు ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

Untitled Document
Advertisements