హఫీజ్‌ సయీద్‌ను చట్ట ప్రకారం శిక్షించాలి :అమెరికా

     Written by : smtv Desk | Fri, Jan 19, 2018, 01:44 PM

హఫీజ్‌ సయీద్‌ను చట్ట ప్రకారం శిక్షించాలి :అమెరికా

వాషింగ్టన్‌, జనవరి 19 : ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి లష్కరై తోయిబా సహా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌ను చట్ట ప్రకారం శిక్షించి తీరాల్సిందేనని పాకిస్థాన్ కు అమెరికా మరోసారి స్పష్టం చేసింది. హఫీజ్‌ సయీద్‌ను "సార్" అని సంభోదిస్తూ, అతనిపై ఎలాంటి కేసు లేదని కేసు ఉంటేనే చర్యలు తీసుకోగలమని పాక్ ప్రధాని షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీ ఈ నెల 15న ఓ ఇంటర్వ్యూలో
ముఖాముఖిగా వ్యాఖ్యానించడాన్ని అగ్రరాజ్యం తప్పుబట్టింది.

అంతేకాకుండా ఉగ్రముకల అణచివేతకు పాక్ చర్యలు చేపట్టల్సిందేనని అమెరికా తేల్చి చెప్పింది. 2008లో ముంబయి 26/11 ఉగ్రదాడుల కీలక సూత్రధారి సయీదేనని అమెరికా విశ్వసిస్తోందని హీతర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉగ్రవాదులపై పోరు విషయంలో ఇటీవల పాక్‌, అమెరికాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements