వాట్సాప్‌ "బిజినెస్"..!

     Written by : smtv Desk | Sat, Jan 20, 2018, 03:58 PM

వాట్సాప్‌

న్యూఢిల్లీ, జనవరి 20 : మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ మరో కొత్త వెర్షన్‌ లో మన ముందుకు రానుంది. త్వరలోనే "వాట్సాప్ బిజినెస్" యాప్ రానున్నట్లు ప్రకటన చేసిన విషయం విదితమే. ఈ యాప్‌లో సాధారణ యాప్‌లో మాదిరిగానే అన్ని ఫీచర్లు లభిస్తున్నాయి. వ్యాపారులు తమ కస్టమర్లకు సులభంగా దగ్గరయ్యేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

దీనిలో ఫొటోలు, వీడియోలు, సందేశాలను పంపించుకునే వీలుంది. వ్యాపారం గురించిన సమాచారం, ఈ-మెయిల్ అడ్రస్‌లు, స్టోర్ చిరునామాలు, వెబ్‌సైట్ వివరాలను నిక్షిప్తం చేసుకోవచ్చు. అంతేకాకుండా వ్యాపారవేత్తలు కస్టమర్ కాల్‌ను స్వీకరించలేని సమయాల్లో ఆటోమేటిక్‌గా వారికి రిప్లై ఇచ్చేందుకు వీలుంది.

అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాప్‌కు ఈ బిజినెస్ యాప్ కు ఎలాంటి సంబంధం లేదు. కాని రెండూ ఒకే రీతిలో కనిపిస్తాయి. ఈ రెండింటిని వేర్వేరు నెంబర్లతో యాక్సెస్‌ చేయొచ్చు. ప్రస్తుతం విదేశాల్లో అందుబాటులో ఉన్న ఈ యాప్ త్వరలో భారత్ లోనూ అందుబాటులోకి రానుంది.

Untitled Document
Advertisements