కాబూల్‌ హోటల్‌లో ఉగ్రదాడి: ఐదుగురు మృతి

     Written by : smtv Desk | Sun, Jan 21, 2018, 11:18 AM

కాబూల్‌ హోటల్‌లో ఉగ్రదాడి: ఐదుగురు మృతి

కాబూల్‌, జనవరి 21: అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. విచక్షణా రహితంగా జరిపిన కాల్పులకు ఐదుగురు మరణించారు. వివరాల్లోకి వెళితే.. అత్యంత విలాసవంతమైన ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌లో శనివారం రాత్రి నలుగురు సాయుధ దుండగులు ప్రవేశించారు. హోటల్‌లోని అతిథులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. ఎనిమిది గంటలకు పైగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని అఫ్గాన్‌ గూఢచర్య సంస్థ తెలిపింది. ఈ దాడికి కారకులు ఎవరో ఇంకా తెలియ రాలేదు.

Untitled Document
Advertisements