తలైవా డబ్బింగ్ మొదలెట్టాడు..

     Written by : smtv Desk | Sun, Jan 21, 2018, 03:36 PM

తలైవా డబ్బింగ్ మొదలెట్టాడు..

చెన్నై, జనవరి 21: సూపర్ స్టార్ రజనీ కాంత్ కథానాయకుడిగా పా రంజిత్‌ దర్శకత్వంలో 'కాలా' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తలైవా ఈ చిత్ర డబ్బింగ్ ను ప్రారంభించారు. ఇందులో రజనీ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రజనీ అల్లుడు, నటుడు ధనుష్‌ నిర్మిస్తున్నారు. సినిమా తొలిభాగం చిత్రీకరణ ముంబయిలో, రెండో భాగం తమిళనాడులో జరిగింది. ఈ చిత్రంలో రజనీ భార్యగా ఈశ్వరీరావు నటిస్తు౦డగా, బాలీవుడ్‌ నటి హ్యుమా ఖురేషీ, నానా పటేకర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం రజనీ నటించిన '2.ఓ' సినిమా వీఎఫ్‌ఎక్స్‌ పనులు జరుగుతున్నాయి.





Untitled Document
Advertisements