రేపటి నుండి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్..

     Written by : smtv Desk | Sun, Jan 21, 2018, 03:54 PM

రేపటి నుండి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్..

న్యూఢిల్లీ, జనవరి 21 : డబ్ల్యూఈఎఫ్(వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్) సదస్సు రేపటి నుండి మొదలు కానుంది. దేశ విదేశాల నుండి రాజకీయ, పౌర, విద్య, కళారంగాలకు చెందిన వ్యక్తులు పాల్గొనే ఈ సదస్సులో తొలిసారి యోగాకు అవకాశం దక్కింది. ప్రతి రోజు రెండు సెషన్ల పాటు యోగా చేయనున్నట్లు ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 20 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో పాల్గొననుండడం విశేషం.

ఇప్పటికే దావోస్ చేరుకున్న ప్రధాని మోదీ ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక సదస్సుకు మొదటిసారిగా తెలంగాణ నుండి ఐటీ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ప్రస్తుతం ఆయన దావుస్ లో ఉన్నారు. అలాగే బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్‌ను సన్మానించనున్నారు. ప్రతి సంవత్సరం క్రిస్టల్ అవార్డుల్లో భాగంగా షారుక్‌కు ఈ అరుదైన గౌరవం దక్కనుంది. అంతేకాకుండా నోరూరించే భారత వంటకాలను రుచి చూపించనున్నారు.





Untitled Document
Advertisements