'కాల భైరవ'గా రానున్నలారెన్స్..

     Written by : smtv Desk | Mon, Jan 22, 2018, 11:43 AM

'కాల భైరవ'గా రానున్నలారెన్స్..

చెన్నై, జనవరి 22: తన స్టెప్పులతో అందరినీ కట్టిపడేసి, తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్నాడు లారెన్స్‌ రాఘవ. అంతేకాదు దెయ్యల చిత్రాలకు దర్శకుడిగా అవతారమెత్తి తన ప్రతిభను చాటాడు. 'ముని', 'కాంచన', 'కాంచన 2', చిత్రాలతో ఘన విజయం అందుకొని ఇప్పుడు 'కాంచన 3'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఆయన మరో కొత్త సినిమాలో నటించనున్నారు. విజయేంద్రప్రసాద్‌ అందించిన ఈ కథకు 'కాల భైరవ' అని టైటిల్ పెట్టారు. ఇది కూడా హర్రర్‌ కథాంశం కలిగిన సినిమా కావడం విశేషం. మార్చిలో చిత్రీకరణ ఆరంభం కానుంది. ఇంకా ఈ సినిమాలోని నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements