ఇక నుండి పేటీఎంలోనూ "బిజినెస్"

     Written by : smtv Desk | Mon, Jan 22, 2018, 02:07 PM

ఇక నుండి పేటీఎంలోనూ

న్యూఢిల్లీ, జనవరి 22 : డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ "పేటీఎం" ఒక కొత్త యాప్ తో మన ముందుకు రానుంది. చిన్న, మధ్య తరహా వ్యాపారస్థుల కోసం "పేటీఎం ఫర్‌ బిజినెస్‌" యాప్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ప్లేస్టోర్ లో ఈ యాప్ అందుబాటులో ఉంది. వ్యాపారస్తులు పేటీఎం ఫర్‌ బిజినెస్‌ యాప్ ను డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో లాగిన్ కావలసి ఉంటుంది. అనంతరం వారికి పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ వస్తుంది.

దీని ద్వారా వారు డిజిటల్‌ పేమెంట్లను స్వీకరించవచ్చు. దీంతో వ్యాపార కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు వీలుగా ఉంటుందని పేటీఎం సీఓఓ కిరణ్‌ వాసిరెడ్డి తెలిపారు. ఈ యాప్‌ ద్వారా వ్యాపారస్థులు ఎలాంటి రుసుములు లేకుండా అపరిమిత పేమెంట్లను నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా నిర్వహించుకునేందుకు ఉపయోగపడుతుంది.

Untitled Document
Advertisements