చైనాలో విడుద‌ల కాబోతున్న స‌ల్మాన్ చిత్రం...

     Written by : smtv Desk | Mon, Jan 22, 2018, 03:20 PM

చైనాలో విడుద‌ల కాబోతున్న స‌ల్మాన్ చిత్రం...

ముంబాయి, జనవరి 22: చైనాలో వరుసగా భార‌త సినిమాలు విడుదలవుతు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో భారతీయ సినిమా అక్కడి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'భ‌జ‌రంగీ భాయ్‌జాన్' చిత్రం చైనాలో మార్చి 2న విడుద‌ల కాబోతోంది. ఈ సినిమా 8 వేల‌కి పైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌ కాబోతుండ‌టం విశేషం.

ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్‌, చైనాకు చెందిన ఈ-స్టార్స్ ఫిల్మ్స్ లిమిటెడ్ సంయుక్తంగా 'లిటిల్ లోలిత మంకీ గాడ్ అంకుల్‌' పేరుతో విడుద‌ల‌ చేయ‌బోతున్న‌ట్లు బాలీవుడ్ ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌చార చిత్రాన్ని కూడా ఆయ‌న పోస్ట్ చేశారు. ఇప్పటికే ఆమిర్ ఖాన్ 'దంగ‌ల్‌', 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌' చిత్రాలు విడుద‌లై భారీ వ‌సూళ్లు రాబ‌ట్టిన సంగ‌తి తెలిసిందే.





Untitled Document
Advertisements