కిమ్‌ జాంగ్‌ ప్రేయసి రాకతో దక్షిణ కొరియాలో ఆందోళనలు..

     Written by : smtv Desk | Tue, Jan 23, 2018, 12:39 PM

కిమ్‌ జాంగ్‌ ప్రేయసి రాకతో దక్షిణ కొరియాలో ఆందోళనలు..

సియోల్, జనవరి 23 : దక్షిణ కొరియాలో జరగనున్న ఒలింపిక్స్‌లో భాగంగా ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ప్రేయసి హ్యోన్‌ సాంగ్‌వోల్‌ ద.కొరియాకు వెళ్లారు. ఈ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా ఒలింపియన్లు కూడా పాల్గొననున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆమె ద.కొరియా వెళ్ళినట్లు తెలుస్తోంది.

హ్యోన్‌ అక్కడకు చేరుకోగానే మీడియా ఆమె ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తూ ఎక్కడకు వెళ్ళిన ఆమెనే ఫాలో అయ్యారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా హ్యోన్‌ రాకతో దక్షిణ కొరియాలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. అక్కడి కార్యకర్తలు కిమ్‌ ఫొటోలను దహనం చేస్తూ హ్యోన్‌ ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు.

Untitled Document
Advertisements