"జీఎస్టీ" చిత్రానికి ఇంత రాద్దాంతం ఎందుకు..? : కత్తి మహేష్

     Written by : smtv Desk | Tue, Jan 23, 2018, 01:07 PM


హైదరాబాద్‌, జనవరి 23 : ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం వర్మ "గాడ్, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌" అనే లఘు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఆపాలంటూ పలువురు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కత్తి మహేష్ వర్మకు మద్దతుగా నిలుస్తూ తన ట్విట్టర్ ఖాతాలో.. "గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్" ఫీచర్‌ సినిమా కాదు. ఇది కేవలం ఓ లఘు చిత్రం మాత్రమే. ఈ మాత్రం దానికే అంత రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు. వర్మ ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనా.. ఇంత హడావుడి చేస్తున్నారు? భారత్‌కు, భారతీయ సంప్రదాయాలకు వర్మ నుంచి ముప్పు ఉందా?" అంటూ ట్వీట్‌ చేశారు.

కత్తి ట్వీట్ కు వర్మ సమాధానంగా.. కత్తి మహేశ్‌.. ఆందోళనకారుల అవివేకం అత్యంత భయంకరమైనది. విదేశీ నటులకు సంబంధించిన ఎన్నో పోర్న్‌ చిత్రాలు నెట్‌లో లభ్యమవుతున్నాయి. కానీ వాళ్లు 'గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌' పైనే ఆందోళన చేస్తున్నారు" అని ట్వీట్‌ చేశారు. కాగా గణతంత్ర దినోత్సవ౦ సందర్భంగా ఈ లఘు చిత్రాన్ని విడుదల చేయనున్నారు.





Untitled Document
Advertisements