కారు బాంబు పేలి 27 మంది దుర్మరణం..

     Written by : smtv Desk | Wed, Jan 24, 2018, 12:39 PM

కారు బాంబు పేలి 27 మంది దుర్మరణం..

లిబియా, జనవరి 24 : బాంబు పేలి 27 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన బెంఘాజి నగరంలోని లిబియాలో చోటు చేసుకుంది. మసీదు నుంచి ప్రజలు బయటకు వస్తున్న సమయానికి రెండు కారు బాంబులు పేలాయి. మొదటి బాంబు పేలిన అరగంట తర్వాత మరో బాంబు పేలిందని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో మొత్తం 27 మంది ప్రాణాలను కోల్పోగా, సుమారు 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుత ఘటనపై ఈ చర్యకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థలు అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. కాగా ఈ దాడిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండిస్తోంది.

Untitled Document
Advertisements