మాటల్లేవ్..మాట్లాడుకోవడాలు లేవ్..

     Written by : smtv Desk | Wed, Jan 24, 2018, 04:31 PM

మాటల్లేవ్..మాట్లాడుకోవడాలు లేవ్..

హైదరాబాద్, జనవరి 24 : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల్లేవ్..మాట్లాడుకోవడాలులేవ్.. అంటూ సమ్మర్ రేస్ కు సిద్ధమవుతున్నడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’ నా ఇల్లు ఇండియా అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించగా, బన్నీకి జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. కాగా ఈ సినిమా విడుదలపై గత కొద్ది రోజులుగా సాగుతున్న చర్చకు నిర్మాతలు స్వస్తి పలికారు. అనుకున్న తేది ప్రకారం ఈ మూవీని ఏప్రిల్ 27న విడుదల చేస్తామని వెల్లడించారు.

అదే రోజున ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భరత్‌ అను నేను’ విడుదల కానుంది. ఓపెనింగ్స్‌ దెబ్బతినకూడదని ‘నా పేరు సూర్య‘ ను ఏప్రిల్‌ 13న విడుదల చేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో చిత్ర నిర్మాతలు ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టారు.





Untitled Document
Advertisements