ఉత్కంఠ రేపుతున్న ‘భాగమతి’ ప్రొమోషనల్ వీడియో..

     Written by : smtv Desk | Wed, Jan 24, 2018, 05:28 PM

ఉత్కంఠ  రేపుతున్న ‘భాగమతి’ ప్రొమోషనల్ వీడియో..

హైదరాబాద్, జనవరి 24 : ‘అరుంధతి’ లో జేజమ్మగా జే..జే లు కొట్టించుకొని, ‘రుద్రమదేవి’ లో తన రౌద్ర రూపంతో అలరించి, ‘బాహుబలి’ లో దేవసేనగా ధైర్యం చూపిన ‘స్వీటీ’.. ప్రస్తుతం 'భాగమతి' గా ప్రేక్షకులను సరికొత్త రూపంలో భయపెట్టడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్లతో సినిమాలో ఆసక్తి పెంచిన చిత్ర బృందం ఇప్పుడు తాజాగా ఈ సినిమా ప్రొమోషనల్ వీడియోను విడుదల చేసి సగటు ప్రేక్షకుడిలో ఉత్కంఠను రేపింది.

అంతే కాకుండా ఈ వీడియోలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా కన్పించడం విశేషం. అశోక్.జి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నారు.





Untitled Document
Advertisements