కొత్త పంథాలో ఉగ్రవాదుల వల.. నిఘా వర్గాల హెచ్చరిక

     Written by : smtv Desk | Wed, Jan 24, 2018, 05:32 PM

కొత్త పంథాలో ఉగ్రవాదుల వల.. నిఘా వర్గాల హెచ్చరిక

న్యూఢిల్లీ, జనవరి 24 : గణతంత్ర దినోత్సవ౦ సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.

ఉగ్రవాదులు దాడుల విషయంలో కొత్త పంథాలను ఎంచుకుంటున్న తరుణంలో ప్రముఖులు పర్యటించే ప్రదేశాలలో భద్రతను మరింత పటిష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

మెటల్‌ డిటెక్టర్లకు అందకుండా ఉండేలా ఉగ్రవాదులు ఐఈడీలు రూపొందించినట్టు సమాచారం ఉందని తెలిపాయి. ఈ ఐఈడీలను టార్చ్‌లు, టైలు, కెమెరాలు, పెద్ద మైకులు, ఆంప్లిఫైర్లలో అమర్చి ఈ దాడులకు పాల్పడవచ్చని హెచ్చరిస్తున్నాయి.





Untitled Document
Advertisements