ఆస్ట్రేలియా ఓపెన్ : సెమీస్ కు చేరిన ఫెడెక్స్‌..

     Written by : smtv Desk | Thu, Jan 25, 2018, 11:42 AM

ఆస్ట్రేలియా ఓపెన్ : సెమీస్ కు చేరిన ఫెడెక్స్‌..

మెల్ బోర్న్, జనవరి 25 ; ఆస్ట్రేలియా ఓపెన్ లో స్విస్ స్టార్ ఫెదరర్ టైటిల్ సాధించేందుకు మరో రెండు అడుగులు దూరంలో నిలిచాడు. నిన్న జరిగిన క్వార్టర్స్ ఫైనల్లో ఫెడెక్స్‌, బెర్డిచ్‌ (చెక్ రిపబ్లిక్) పై విజయం సాధించి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ఈ టోర్నీలో ఫెదరర్ సెమీస్ కు చేరడం 14వ సారి. మరో వైపు అగ్రశ్రేణి ఆటగాళ్లను మట్టికరిపిస్తూ అప్రతిహతంగా దూసుకెళ్తున్న దక్షిణ కొరియా యువతేజం చంగ్‌, సాండ్‌గ్రిన్‌ (అమెరికా)పై గెలుపొందాడు.

మహిళా సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ హలెప్‌(రొమేనియా), మాజీ నంబర్‌వన్‌ కెర్బర్‌ (జర్మనీ) సెమీస్‌ చేరారు. భారత క్రీడాకారుడు రోహన్‌ బోపన్న మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సెమీస్ కు అర్హత సాధించాడు.

సెమీస్ లో ఎవరితో ఎవరు..?

పురుషుల సింగిల్స్..
సిలిచ్‌ (క్రోయేషియా) × ఎడ్మండ్‌ (బ్రిటన్)
ఫెదరర్‌ (స్విట్జర్లాండ్) × చంగ్‌ (దక్షిణా కొరియా)

మహిళల సింగిల్స్‌ ..
హలెప్‌ (రొమేనియా) × కెర్బర్‌ (జర్మనీ)
మెర్టిన్స్‌ (బెల్జియం) × వోజ్నియాకి (డెన్మార్క్)





Untitled Document
Advertisements