బ్రెజిల్‌ లో భారీగా ఐఫోన్స్ సీజ్ తో చిక్కుల్లో పడ్డ యాపిల్‌ సంస్థ..

     Written by : smtv Desk | Sat, Nov 26, 2022, 06:24 PM

బ్రెజిల్‌ లో భారీగా ఐఫోన్స్ సీజ్ తో చిక్కుల్లో పడ్డ యాపిల్‌ సంస్థ..

యునైటెడ్ స్టేట్స్‌లోని కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ. యాపిల్‌ ఆదాయం పరంగా అతిపెద్ద సాంకేతిక సంస్థ మరియు జూన్ 2022 నాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ , యూనిట్ విక్రయాల ద్వారా నాల్గవ-అతిపెద్ద పర్సనల్ కంప్యూటర్ విక్రేత మరియు రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారు. ఇది ఆల్ఫాబెట్ , అమెజాన్ , మెటా , మరియు వంటి పెద్ద ఐదు అమెరికన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలలో ఒకటి మైక్రోసాఫ్ట్. అయితే ఇంటర్నేషనల్ టెక్ కంపెనీ యాపిల్ చిక్కుల్లో పడింది. కొత్తగా ఐఫోన్లను కొనే కస్టమర్లకు ఫోన్‌తో పాటు చార్జర్‌ను అందించకపోవడంతో, కంపెనీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇదే కారణంతో కంపెనీకి షాక్ ఇచ్చింది బ్రెజిల్‌. ఆ దేశంలో వందలాది ఐఫోన్లను అధికారులు సీజ్ చేశారు. రిటైల్ బాక్స్‌లో ఐఫోన్‌తో పాటు ఛార్జర్ బండిల్ చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. యాపిల్ కంపెనీ ఇటీవల కాలంలో ఐఫోన్‌లతో పాటు ఛార్జర్స్ ఇవ్వడం ఆపేసింది. ఈ కారణంగా బ్రెజిల్‌లోని వివిధ రిటైల్ స్టోర్స్‌లో వందలాది ఐఫోన్లను అక్కడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యకు ‘ఆపరేషన్ డిశ్చార్జ్’ అని పేరు పెట్టారు. కాగా తాజా ఘటనపై యాపిల్ స్పందించింది. ఐఫోన్లను విక్రయించడానికి అనుమతించాలని అక్కడి ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ ఘటనపై కోర్టు తీర్పు వెల్లడించే వరకు ఐఫోన్ల అమ్మకాలను అనుమతించాలని యాపిల్ కోరినట్లు 9To5Mac రిపోర్ట్ వెల్లడించింది.
కావున బ్రెజిల్‌లోని క్యారియర్ స్టోర్‌లతో పాటు కంపెనీ ఆథరైజ్డ్ రీసెల్లర్ స్టోర్స్‌లోనూ ఐఫోన్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఛార్జర్ లేకుండా ఐఫోన్‌లను విక్రయించకూడదనే తాజా ఆర్డర్‌కు ఏ కంపెనీ అయినా కట్టుబడి ఉండాల్సిందే‌నని బ్రెజిల్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా యాపిల్ పై ప్రస్తుతం చర్యలకు ఉపక్రమించింది. అయితే యాపిల్ కంపెనీ ఐఫోన్ 12 సిరీస్ నుంచి ఛార్జర్‌ను ఇవ్వడం ఆపేసింది. యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్రెజిల్‌లో కొన్ని నెలలకే కస్టమర్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఇదే కారణంతో ఇప్పుడు అక్కడి ప్రభుత్వం ఐఫోన్స్‌ను సీజ్ చేసింది. కాగా, గతంలోనూ యాపిల్ కంపెనీపై బ్రెజిల్ చర్యలు తీసుకుంది. ఐఫోన్స్‌కు ఛార్జర్ ఇవ్వకపోవడంతో రెండు సార్లు జరిమానా కూడా విధించారు. రిటైల్ బాక్స్‌ల్లో ఐఫోన్‌తో పాటు ఛార్జర్ లేకపోవడంతో గత అక్టోబర్‌లో యాపిల్‌పై బీఆర్ఎల్ 100 మిలియన్ (సుమారు రూ.150 కోట్లు) జరిమానా విధించారు. ఈ ఘటనపై కోర్టుకు అప్పీల్ చేస్తామని అప్పుడు యాపిల్ ప్రకటించింది. మరోపక్క రుణగ్రహీతలు, కస్టమర్లు, పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్స్ యాపిల్‌‌పై బ్రెజిల్‌లోని సావో పాలో స్టేట్ కోర్టు‌లో పిటిషన్ దాఖాలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు యాపిల్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. యాపిల్ కంపెనీ తన ప్రీమియం డివైజస్‌ను ఛార్జర్ లేకుండా విక్రయించడం ద్వారా దుర్వినియోగానికి పాల్పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
అంతకు ముందు సెప్టెంబర్‌లోనూ యాపిల్‌పై బ్రెజిల్ చర్యలు తీసుకోంది. ఐఫోన్‌తో పాటు ఛార్జర్ విక్రయించకపోవడంతో దీని తయారీ సంస్థపై దాదాపు $2.5 మిలియన్ల జరిమానా విధించారు. అంతేకాకుండా రిటైల్ బాక్స్ లో ఛార్జర్ ఆఫర్ చేసే వరకు బ్రెజిల్‌లో ఐఫోన్ల విక్రయాలపై నిషేధం కూడా విధించారు. అయితే ఆ తరువాత ఐఫోన్ల విక్రయానికి యాపిల్ అనుమతి పొందింది.
మరియు యాపిల్ నిర్ణయం వల్ల ఛార్జర్‌ను కొనుగోలు చేయడానికి ప్రజలు అదనపు ఖర్చు చేయాల్సి ఉంటుందని బ్రెజిల్ అధికారులు పేర్కొన్నారు. పైగా పర్యావరణం పేరుతో యాపిల్ డబ్బును ఆదా చేస్తోందని మండిపడ్డారు. ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఛార్జర్ ముఖ్యమైన యాక్సెసరీ అని, అది లేకుండా ఫోన్ అసలు పనిచేయదన్నారు. కాగా, కోర్టు తీర్పు ప్రకారం.. యాపిల్ రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను కూడా ఇకపై ఆఫర్ చేయాల్సి ఉంటుంది.





Untitled Document
Advertisements