ఓటు వేద్దాం.. రాత మార్చుకుందాం..

     Written by : smtv Desk | Thu, Jan 25, 2018, 12:34 PM

ఓటు వేద్దాం.. రాత మార్చుకుందాం..

హైదరాబాద్, జనవరి 25 : ఓటు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రెండక్షరాల పదం.. ఒక వజ్రాయుధం. అఖండ భారతావనిలో ప్రజలు తమ నాయకులను ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం ఇచ్చిన అమూల్యమైన హక్కు. కాగా ఈ రోజు ను కేంద్ర ప్రభుత్వం “ జాతీయ ఓటర్ల దినోత్సవం” గా ప్రకటించింది. పల్లె నుంచి పార్లమెంటు వరకూ ఏ స్థాయిలో ఎన్నికలు జరిగినా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్న నినాదం ఇపుడు మార్మోగుతోంది.

జాతి, కుల, మత బేధాలు లేకుండా భారతదేశంలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అయితే చాలా మంది ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించడం బాధాకరం. 125 కోట్ల ఇండియా జనాభాలో సుమారు 100 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉండగా, 50 కోట్ల మంది ఓటును ఉపయోగిస్తున్నారు.

ఈ పద్ధతి ప్రస్తుత తరంలో మారాలి. రాజకీయ రంగంలో నేర చరిత్ర కలిగిన నాయకులు తమ స్వార్ధం కోసం ప్రజలను మభ్య పెట్టి అధికార పీఠం దక్కించుకొని తర్వాత తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎంతటి రాజకీయ ఉద్దండులైన ప్రజాస్వామ్య పరిధిలో ‘ఓటు’ అనే అక్షరంకు తలవంచక తప్పదు. అదే ఆయుధం..అదే అవసరం.. ఇప్పటికైనా మారుదాం.. ఓటు వేసి రాత మార్చుకుందాం..





Untitled Document
Advertisements