శ్రీ దేవి వదనంకు ఏమయ్యింది..!

     Written by : smtv Desk | Thu, Jan 25, 2018, 03:33 PM

శ్రీ దేవి వదనంకు ఏమయ్యింది..!

ముంబాయి, జనవరి 25 : ఏంటి పైన ఫోటోలు చూసి అవాక్కయ్యారా..! మీరు చూస్తున్నది నిజమే.. ఆమె అలనాటి అందాల తార శ్రీదేవి.. ఇటీవల వసంత పంచమి సందర్భంగా దర్శకుడు అనురాగ్‌ బసు ఇంట్లో సరస్వతి పూజ చేశారు. ఈ పూజకు పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలతో పాటు శ్రీదేవి కూడా హాజరయ్యారు. ఆమె కారు దిగగానే తన వదనం లో మార్పుని చూసి ఆశ్చర్యపోయారు. మూతి అలా ఎందుకు అయిపోయింది? అని మీడియా ప్రశ్నించినా ఆమె స్పందించలేదట.

ఇంతకు ముందు శ్రీదేవి నటించిన ‘ఇంగ్లీష్‌ వింగ్లిష్‌’ సినిమా సమయంలోనూ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి. దీనిపై గురించి ఆమె స్పందిస్తూ..‘అలాంటిదేమీ లేదు. నేను ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాను. పవర్‌ యోగా చేస్తాను. వారంలో నాలుగు రోజులు టెన్నిస్‌ ఆడతాను. వీటన్నిటి వల్లే శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి’ అని వెల్లడించారు.





Untitled Document
Advertisements