మిలాన్ లో రైలు ప్రమాదం.. నలుగురి మృతి

     Written by : smtv Desk | Thu, Jan 25, 2018, 05:43 PM

మిలాన్ లో రైలు ప్రమాదం.. నలుగురి మృతి

మిలాన్‌, జనవరి 26 : ఇటలీలో జరిగిన రైలు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. మిలాన్‌ నగరంలోని పియోల్‌టెల్లో స్టేషన్‌ వద్ద ఉదయం 7 గంటలకు(అక్కడి కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగింది. రైలు వేరొక పట్టాల మార్గంలోకి మారుతున్నపుడు ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 100 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగే ముందు రైలు కుదుపులకు గురైందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. రెండు బోగీలు ప్రమాదానికి గురయ్యాని, ప్రమాదానికి గల కారణాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని మిలాన్‌ పోలీస్‌ చీఫ్‌ మార్సెల్లో కార్డోనా వెల్లడించారు.

Untitled Document
Advertisements