జెండాను ఆవిష్కరించిన దేశ ప్రథమ పౌరుడు..

     Written by : smtv Desk | Fri, Jan 26, 2018, 12:20 PM

జెండాను ఆవిష్కరించిన దేశ ప్రథమ పౌరుడు..

న్యూఢిల్లీ, జనవరి 26 : రాజ్‌పథ్‌లో 69వ గణతంత్ర వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్‌ కోవింద్‌ జెండాను ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద సైనిక వీరులకు నివాళులర్పించారు. అంతేకాకుండా ఈ వేడుకలకు పది ఆసియాన్‌ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఆయా దేశాలకు సంబంధించిన జెండాలను సైతం ప్రదర్శించారు.

గణతంత్ర వేడుకల్లో భాగంగా సైనిక దళాల పరేడ్‌ ఆకట్టుకుంది. టీ-90 యుద్ధ ట్యాంకర్ల ప్రదర్శనతో పరేడ్‌ ప్రారంభ౦ కాగా, ఆర్మీ, వాయు సేన, నావికా దళాలలకు చెందిన శకటాలతో పాటు బీఎస్‌ఎఫ్‌ దళాలు, ఇండో టిబెటిన్‌ బార్డర్‌ పోలీసు బలగాలు, సశస్త్ర సీమబల్‌ బ్యాండ్, దిల్లీ పోలీసులు, ఎన్‌సీసీ బృందాల ప్రదర్శన అద్భుతంగా సాగింది.





Untitled Document
Advertisements