సరికొత్త ఆఫర్ తీసుకొచ్చిన జియో..

     Written by : smtv Desk | Fri, Jan 26, 2018, 03:35 PM

సరికొత్త ఆఫర్ తీసుకొచ్చిన జియో..

న్యూఢిల్లీ, జనవరి 26 : రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ జియో రూ. 49 ప్లాన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తమ 4జీ ఫీచర్‌ఫోన్‌ జియోఫోన్‌ వినియోగదారులు రూ.49తో రీఛార్జి చేసుకుంటే, 28 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్‌ తో పాటు 1 జీబీ డేటా లభించే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. కాకపోతే ఈ ఆఫర్ కేవలం జియో ఫీచర్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఒకవేళ అదనపు డేటా కావాలనుకుంటే మాత్రం రూ.11, 21, 51, 101తో రీఛార్జి చేసుకోవాలని తెలిపింది. జియో ఫీచర్ ఫోన్ ల కొనుగోళ్లను మరింత ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో వెల్లడించింది.

Untitled Document
Advertisements