లక్ష్యం భారత్, మోదీ : జైషే-ఈ- మహ్మద్

     Written by : smtv Desk | Fri, Jan 26, 2018, 04:26 PM

లక్ష్యం భారత్, మోదీ : జైషే-ఈ- మహ్మద్

ఇస్లామాబాద్‌, జనవరి 26 : పాక్ ఉగ్రవాద సంస్థ జైషే-ఈ- మహ్మద్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసింది. చైనా అండతో నిర్బంధం నుంచి తప్పించుకు తిరుగుతున్న మౌలానా మసూద్‌ అజార్ నేతృత్వంలోని జైష్‌ -ఈ- మొహమ్మద్‌.. ఇండియాను ప్రప్రధమ శత్రువుగా, ప్రధాని మోదీని రెండవ శత్రువుగా ప్రకటించారు. సింధ్‌ రాష్ట్రంలోని లర్కానాలో జరిగిన బహిరంగ సభలో అజార్‌ సోదరుడు, జేషే కీలక నేత మౌలానా తల్హా సైఫ్‌ ఈ విషయాలను వెల్లడించాడు. ‘హిందుస్తాన్‌పై జిహాద్‌కు ముందుకురావాల’ని యువతను రెచ్చగొట్టాడు.

‘‘మనకు నంబర్‌ 1 శత్రువు ఇండియా, నంబర్‌ 2 మోదీ. అల్‌ ఖలామ్ (అజార్ నేతృత్వంలో నడిచే పత్రిక) ద్వారా ఈ వార్తన్ని అందరికీ. ఇండియాలోని మనవాళ్లు అల్‌ ఖలామ్‌ వెబ్‌సైట్‌ ద్వారా విషయాలను తెలుసుకోవచ్చు. ఉపఖండంలో మినీ సూపర్‌ పవర్‌గా వ్యవహరిస్తోన్న భారత్‌.. మొదటి నుంచీ పాకిస్తాన్‌కు ప్రతి విషయంలో అడ్డుపడుతుంది. కానీ కశ్మీర్‌లో మాత్రం భారత సైన్యం కష్టాలను ఎదుర్కొంటుంది. కశ్మీరీ తల్లులు, సోదరీమణులు సాయం కోసం మనల్ని పిలిచారు. కానీ మనం మాత్రం బానిసలుగా ఉండిపోయాం. కానీ ఇప్పుడు.. ముజాహిద్దీన్‌లు సరిహద్దు దాటి చొచ్చుకెళ్లగలుగుతున్నారు. ఇండియాపై జిహాద్‌ చెయ్యడానికి ధైర్యవంతులైన యువకులు ముందుకు రావాలి’’ అని మౌలానా సైఫ్‌ వ్యాఖ్యానించాడు.

Untitled Document
Advertisements