రాష్ట్రంలో మరో ఐదు పాస్‌పోర్టు సేవాకేంద్రాలు..

     Written by : smtv Desk | Sat, Jan 27, 2018, 11:24 AM

రాష్ట్రంలో మరో ఐదు పాస్‌పోర్టు సేవాకేంద్రాలు..

విజయవాడ, జనవరి 26 : రాష్ట్రంలో నూతనంగా ఐదు పాస్‌పోర్టు సేవాకేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి డీఎస్ఎస్ శ్రీనివాసరావు వెల్లడించారు. గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, అనంతపూర్, విజయవాడలలో మరో రెండునెలల్లో పాస్‌పోర్టు సేవాకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే నెల్లూరు, కడప, కర్నూల్ లో పాస్‌పోర్టు సేవాకేంద్రాలున్నాయి.

Untitled Document
Advertisements