హైవే ప్రమాదాల సమాచారం కోసం ‘1033’ టోల్ ఫ్రీ...

     Written by : smtv Desk | Sat, Jan 27, 2018, 02:17 PM

హైవే ప్రమాదాల సమాచారం కోసం ‘1033’ టోల్ ఫ్రీ...

న్యూఢిల్లీ, జనవరి 27 : ప్రస్తుతం భారతదేశ౦లో రోడ్డు ప్రమాదాలు సంఖ్యా గణనీయంగా పెరుగుతుంది. వాహనాలను అతి వేగంగా నడపటం, మద్యం, నిద్ర మత్తులో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాలు ప్రజలను ఎక్కువగా భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత సమాచారం తగిన సమయంలో అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక పై అటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు జాతీయ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) ‘1033’ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తోంది. అంతే కాకుండా త్వరలోనే దీనిపై ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించింది





Untitled Document
Advertisements