బొడ్డుపల్లి హత్య కేసులో వీడని మిస్టరీ..

     Written by : smtv Desk | Sun, Jan 28, 2018, 01:02 PM

బొడ్డుపల్లి హత్య కేసులో వీడని మిస్టరీ..

హైదరాబాద్, జనవరి 28 : నల్గొండ పురపాలక సంఘం చైర్‌పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఈ తరుణంలో శ్రీనివాస్‌ హత్య కేసులో నిందితులంతా కాంగ్రెస్‌వారేనని తెరాస శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు కర్నె ప్రభాకర్‌, గాదరి కిశోర్‌లు అన్నారు. ఈ కేసులో న్యాయ విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన కర్నె ప్రభాకర్‌, గాదరి కిశోర్‌లు.. "అక్రమాలకు కాంగ్రెస్ మారుపేరు. తెరాస ఎమ్మెల్యే వేముల వీరేశంపై అభియోగాలు మోపుతూ అతని ఫోన్‌కాల్స్‌ జాబితాను బయటపెట్టాలంటున్నారు. ఒకవేళ అదే జరిగితే.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్‌కాల్స్‌ జాబితాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి శవ రాజకీయాలు తెరాస సహించేదు" అని పేర్కొన్నారు.

మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా వీహెచ్‌, గీతారెడ్డి, షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ల బృందం సీఎల్పీ కార్యాలయం నుంచి పాదయాత్రగా వెళ్లి డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈ ఆరోపణల నడుమ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రాణహాని ఉన్న౦దున ఆయనకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంతోపాటు అదనపు భద్రత కల్పించాలని, నకిరేకల్‌లో వీరేశం మీద పోటీ చేసిన కాంగ్రెస్‌ నాయకుడు చిరుమర్తి లింగయ్యకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరామన్నారు.





Untitled Document
Advertisements