నాపై వచ్చిన ప్రచారం బాధ కలిగించింది : జస్టిస్‌ చలమేశ్వర్‌‌

     Written by : smtv Desk | Sun, Jan 28, 2018, 05:36 PM

నాపై వచ్చిన ప్రచారం బాధ కలిగించింది : జస్టిస్‌ చలమేశ్వర్‌‌

విజయవాడ, జనవరి 28 : దేశంలో ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా సమానత్వం సాధించాలనేది రాజ్యాంగ లక్ష్యమని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ అన్నారు. రాజ్యాంగ ధర్మం, పౌరసమాజం అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని పౌరులందరికి సమానత్వం వర్తింపజేయాలన్నది మన రాజ్యాంగంలోని కీలక అంశ౦. కాని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు.

వారసత్వ రాజకీయాలు, అవినీతి, ఎన్నికల్లో డబ్బు కీలకం ఇలా అవినీతి బాగా పెరిగిపోవడం కారణంగా ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయాలకు చెందిన వ్యక్తిగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం బాధ కలిగించిందని, తను పదవి చేపట్టిన నాటి నుండి రాజకీయాలతో సంబంధాలు వదులుకున్నానని స్పష్టం చేశారు. తానూ పదవి విరమణ అనంతరం ప్రభుత్వాన్ని ఏ పదవి కోరనని వెల్లడించారు.

Untitled Document
Advertisements