వైరల్ గా మారిన ‘ఇళయ దళపతి’ లుక్..

     Written by : smtv Desk | Sun, Jan 28, 2018, 10:51 PM

 వైరల్ గా మారిన ‘ఇళయ దళపతి’ లుక్..

చెన్నై, జనవరి 28 : ‘ఇళయ దళపతి’ గా అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వ్యక్తి ‘విజయ్’. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన ‘అదిరింది’ (తమిళంలో ‘మెర్సల్‌’) సినిమా ఎన్నో వివాదాల మధ్య సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం విజయ్ ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్‌ లుక్‌కు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తుంది. గతంలో వీరద్దరి కలయికలో వచ్చిన ‘తుపాకీ’, ‘కత్తి’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.

విజయ్‌ 62వ సినిమా లుక్‌ ఇదేనంటూ ప్రచారం కుడా జరుగుతుంది. ఇందులో విజయ్‌ చాలా స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తిసురేశ్‌ కథానాయకగా నటిస్తుంది.





Untitled Document
Advertisements