అమెరికాలో మంత్రి లోకేష్ బిజీ బిజీ..

     Written by : smtv Desk | Mon, Jan 29, 2018, 02:01 PM

అమెరికాలో మంత్రి లోకేష్ బిజీ బిజీ..

లాస్‌ఏంజిల్స్, జనవరి 29 : ఏపీ ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా లాస్‌ఏంజిల్‌ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఎన్‌ఆర్‌ఐల నుండి ఘన స్వాగతం లభించింది. అక్కడి నుండి ఎన్ఆర్ఐ టీడీపీ, ఏపీ ఎన్‌ఆర్టీ సభ్యులతో సమావేశమయ్యారు. మూడున్నర ఏళ్లలో ఎన్నో సమస్యలను అధిగమించి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రాభివృధ్దికి ఎన్‌ఆర్‌ఐలు సహకరించాలని సూచించారు.

ఏపీ తలసరి ఆదాయం దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువగా ఉందని తెలిపారు. అనంతరం ఇన్వెస్ట్‌మెంట్‌ రోడ్‌ షో నిర్వహించారు. అక్కడ ఎలక్టో హెల్త్‌కేర్‌ సీఈవో లక్ష్మణ్‌రెడ్డిని కలుసుకున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ ఎలక్టో హెల్త్‌ కేర్‌మెడ్‌ టెక్‌ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే పెద్ద ఎత్తున మెడికల్ వస్తువుల తయారీ రంగాన్ని ప్రోత్సహి౦చి రాయితీలు కల్పిస్తామన్నారు.

Untitled Document
Advertisements