ట్రాన్సిస్టర్‌కు ప్రత్యామ్నాయంగా ‘మెమ్రిస్టర్‌’..

     Written by : smtv Desk | Mon, Jan 29, 2018, 03:47 PM

ట్రాన్సిస్టర్‌కు ప్రత్యామ్నాయంగా ‘మెమ్రిస్టర్‌’..

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రస్తుత సాంకేతిక రంగంలో ఎలక్ట్రానిక్ పరికరాలు మనవ జాతి మనుగడకు ఎంతో ముఖ్యం. వాడుతున్న ప్రతి వస్తువు ఎప్పటికప్పుడు రూపాంతరం చెంది మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాయి. తాజాగా ట్రాన్సిస్టర్‌కు ప్రత్యామ్నాయంగా.. దానికంటే అతి చిన్న సైజులో ఉండే ‘మెమ్రిస్టర్‌’ను నానో టెక్నాలజీ సాయంతో శాస్త్రవేత్తలు రూపొందించారు.

ట్రాన్సిస్టర్‌ మాదిరిగానే సర్క్యూట్లలో సెమీకండక్టర్‌గా పనిచేసే మెమ్రిస్టర్‌ (మెమొరీ + ట్రాన్సిస్టర్‌)లో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని సౌతంప్టాన్‌ వర్సిటీ పొఫ్రెసర్‌ థెమిస్‌ ప్రోడ్రోమకీస్‌ వెల్లడించారు. ఒక స్విచ్‌కు 128 డీఎంల మేర దీని మెమొరీ ఉంటుంది. అంటే.. దీన్నిఆపినా.. తిరిగి ఆన్‌ చేసినప్పుడు గతంలో ఏయే వివరాలను భద్రపరుచుకుందో ఆ సమాచారం ఉంటుంది.





Untitled Document
Advertisements