సీపీఈసీ ప్రాజెక్ట్ పై చర్చలకు మేము సిద్దం : చైనా

     Written by : smtv Desk | Mon, Jan 29, 2018, 04:31 PM

సీపీఈసీ ప్రాజెక్ట్ పై చర్చలకు మేము సిద్దం : చైనా

బీజింగ్‌, జనవరి 29 : చైనా దేశం నిర్మిస్తున్న చైనా -పాకిస్తాన్‌ ఎకానమిక్‌ కారిడార్‌(సీపీఈసీ) ప్రాజెక్టుపై భారత్‌కు అభ్యంతరాలు ఉన్నాయని చైనాలోని భారత రాయబారి గౌతమ్‌ బాంబవాలే చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. కాగా ఈ విషయంపై భారత్ తో చర్చలకు సిద్దంగా ఉన్నామని సోమవారం చైనా ప్రకటించింది.

ఇరు దేశాల జాతీయ ప్రయోజనాలు సీపీఈసీ కారణంగా ప్రభావితం అవకుండా ముందే చర్చలు జరపడం మంచిదని చైనా సూచించింది. 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో ప్రారంభిస్తున్న సీపీఈసీ ప్రాజెక్టు పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) గుండా వెళ్లడాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్సులో గల గ్వాదర్‌ పోర్టు నుంచి చైనాలోని గ్జిన్‌జియాంగ్‌ ప్రావిన్సును సీపీఈసీ ప్రాజెక్టు కలుపుతుంది.

Untitled Document
Advertisements