మామా పాటకు.. మేనల్లుడి ఆట..

     Written by : smtv Desk | Mon, Jan 29, 2018, 09:10 PM

మామా పాటకు.. మేనల్లుడి ఆట..

హైదరాబాద్, జనవరి 29 : మెగా స్టార్ కుటుంబం నుండి వచ్చిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన హీరో గా వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. ఈ చిత్రంలో అలనాటి చిరు సూపర్ హిట్ మూవీ 'కొండ వీటి దొంగ' లో ‘చమక్‌ చమకు ఛాం’ సాంగ్‌ను రీమిక్స్‌ చేశారు. ఇంతకు ముందు సాయి ధరమ్ కొన్ని చిత్రాల్లో కూడా చిరంజీవి సినిమాల్లోని పాటలను రీమిక్స్‌ చేసిన విషయం తెలిసిందే.

చాలా ఫ్రేమ్‌ల్లో తేజ్‌ అచ్చం చిరంజీవిలా ఉన్నారంటూ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తేజ్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న ధియేటర్లలో సందడి చేయనుంది.





Untitled Document
Advertisements