'ఐసీటీ' లో పోటీ ఎదుర్కొంటున్న భారత్..

     Written by : smtv Desk | Tue, Jan 30, 2018, 11:35 AM

'ఐసీటీ' లో పోటీ ఎదుర్కొంటున్న భారత్..

న్యూఢిల్లీ, జనవరి 30: ప్రస్తుతం భారతదేశం ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా సమాచార సాంకేతిక విజ్ఞానం (ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ-ఐసీటీ) ఎగుమతుల్లో భారత్‌ తీవ్రంగా పోటీ ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చైనా, బ్రెజిల్‌లు పోటీ ఇస్తున్నాయి. ప్రపంచబ్యాంకు నివేదిక ఆధారంగా 2006లో భారత్‌ నుంచి ఎగుమతి అయిన మొత్తం సేవల్లో ఐటీసీ వాటా 68 శాతం కాగా, 2016 నాటికి అది 67 శాతానికి తగ్గింది.

ఇది తక్కువే అయినప్పటికీ, మిగిలిన దేశాల నుంచి పోటీ ఎదురవుతోందన్న విషయం తేటతెల్లమైంది. ఇదేసమయంలో చైనా, బ్రెజిల్‌ల నుంచి ఎగుమతులు గణనీయంగా పెరగడంతో ఆ రెండు దేశాల నుంచి గట్టిపోటీ ఉన్నట్టు గమనించాల్సి ఉంటుందని నివేదిక వెల్లడించింది.

Untitled Document
Advertisements