టీడీపీ తీర్థం పుచ్చుకున్న సుబ్రహ్మణ్యంరెడ్డి..

     Written by : smtv Desk | Tue, Jan 30, 2018, 01:21 PM

టీడీపీ తీర్థం పుచ్చుకున్న సుబ్రహ్మణ్యంరెడ్డి..

అమరావతి, జనవరి 30 : జడ్పీ మాజీ చైర్మన్‌ ఎం.సుబ్రహ్మణ్యంరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్ష౦లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "విభజన పరంగా కొంత నష్టపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రేయింబవళ్ళు కష్టపడుతున్నాం. ప్రజలు మాకు అండగా ఉండాలి" అని పేర్కొన్నారు.

అంతేకాకుండా నీతినిజాయితీ కలిగిన నేత సుబ్రమణ్యం రెడ్డి అని, ఆయన గౌరవాన్ని కాపాడతామని తెలిపారు. అనంతరం సుబ్రమణ్యం రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీలో నీతినిజాయితీ ఉన్న వారికి గుర్తింపు లేదన్నారు. చంద్రబాబుకు అండగా ఉండాలనే టీడీపీలో చేరినట్లు తెలిపారు. కాగా సుబ్రహ్మణ్యంరెడ్డి.. కాంగ్రెస్‌ తరఫున కుప్పం నియోజకవర్గం నుండి వరుసగా మూడు ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోవడం గమనార్హం.

Untitled Document
Advertisements