వైట్ హౌస్ అధికారులు తప్పిదం.. నెట్టింట్లో వైరల్‌..

     Written by : smtv Desk | Tue, Jan 30, 2018, 02:35 PM

వైట్ హౌస్ అధికారులు తప్పిదం.. నెట్టింట్లో వైరల్‌..

వాషింగ్టన్‌, జనవరి 30: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్లలో అక్షర దోషాలు దొర్లడం సహజమే. ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రోజున ‘‘HONERED to Serve’’ అంటూ ట్వీట్‌ చేసి నవ్వుల పాలయ్యారు. ఇటీవల ఓ అంశం గురించి ట్వీట్‌ చేస్తూ.. coverageకు బదులుగా covfefe అని రాశారు. అయితే తాజాగా తమ అధ్యక్షుడి కంటే తామేమి తక్కువ కాదు అనుకున్నారేమో..వైట్ హౌస్ అధికారులు. వారు కూడా అతని బాటలోనే పయనిస్తున్నారు.

అసలు విషయం ఎంటంటే.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌ తొలిసారిగా స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌లో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించేందుకు వైట్‌హౌస్‌ ఆహ్వాన పత్రికలు ముద్రించింది. అయితే అందులో 'union'కు బదులుగా 'uniom' అని ప్రింట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఆహ్వాన పత్రిక అంతర్జాలంలో ఫుల్ వైరల్ గా మారింది. అయితే దీనిపై వైట్‌హౌస్‌ స్పందించింది. పొరబాటును తెలుసుకుని వెంటనే కార్డులను మళ్లీ ముద్రించామని పేర్కొన్నపటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Untitled Document
Advertisements