దేశంలో గవర్నర్ల వ్యవస్థ ఉండాలి : రోశయ్య

     Written by : smtv Desk | Tue, Jan 30, 2018, 02:38 PM

దేశంలో గవర్నర్ల వ్యవస్థ ఉండాలి : రోశయ్య

గుంటూరు, జనవరి 30 : "నేను ఎప్పటికి కాంగ్రెస్ వాదినే" అంటూ తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేయడం తనకు సాధ్యపడడం లేదన్న ఆయన ఎన్ని పదవులిచ్చిన వాటిని నిర్వర్తించే సామర్థ్యం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే జయరామ్ బాబు ఇంటికి విచ్చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గవర్నర్ల వ్యవస్థ ఉండాల్సిందేనని, కొన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు గవర్నర్ల పాత్ర చాలా కీలకమైందని రోశయ్య అభిప్రాయపడ్డారు. ఆయన వెంట మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ, జేడీ శీలం, రాయపాటి శ్రీనివాస్ ఉన్నారు.

Untitled Document
Advertisements