దూసుకెళ్తున్న యువ తేజం..

     Written by : smtv Desk | Tue, Jan 30, 2018, 03:05 PM

దూసుకెళ్తున్న యువ తేజం..

న్యూఢిల్లీ, జనవరి 30 : ఐసీసీ అండర్-19 లో భారత్ మాజీ క్రికెటర్ ద్రావిడ్ నేతృత్వంలోని టీమిండియా జట్టు అన్ని మ్యాచ్ ల్లో గెలిచి ఫైనల్ కు చేరుకుంది. ముఖ్యంగా సెమీ ఫైనల్లో దాయాది దేశం పాకిస్తాన్ పై మన జట్టు మరిచిపోలేని విజయాన్ని దక్కించుకొంది. సెమీస్ మ్యాచ్ ల్లో యువ ఆటగాడు శుభ మాన్ గిల్(102) సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ టోర్నీలో జింబాబ్వే, బంగ్లాదేశ్‌, 90, 86, పరుగులతో ఆకట్టుకున్న ఈ పంజాబ్ ఆటగాడు తాను క్రికెట్‌ ఆడటానికి సచిన్‌, ద్రవిడ్‌, లక్ష్మణ్‌లే కారణమని చెబుతున్నాడు.

పాక్ తో విజయం తర్వాత గిల్ మాట్లాడుతూ.. " నేను క్రికెట్ ఆడటానికి చాలా ఇష్టపడతాను. సచిన్‌, ద్రవిడ్‌, లక్ష్మణ్‌లే నాకు ఆదర్శం. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒత్తిడికి గురికాను. పాక్ తో మ్యాచ్ అంటే ఒత్తిడి సహజం, కానీ నేను మ్యాచ్ కు ముందు రోజు మంచి భోజనం చేసి హాయిగా నిద్రపోయాను. ఆస్ట్రేలియా తో ఫైనల్ కోసం ఎదురుచూస్తున్నా" అని వ్యాఖ్యానించారు.

తాజాగా నిర్వహించిన ఐపీఎల్‌ వేలంలో రూ.1.8 కోట్లకు గిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది. కాగా ఫిబ్రవరి 3న భారత్, ఆసీస్ జట్లు ఫైనల్లో తలపడనున్న విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements