'వివో' నుండి 10జీబీ ర్యామ్ ఫోన్..!

     Written by : smtv Desk | Tue, Jan 30, 2018, 04:15 PM

'వివో' నుండి 10జీబీ ర్యామ్ ఫోన్..!

బీజింగ్‌, జనవరి 30: ప్రస్తుత విపణిలో స్మార్ట్ ఫోన్ లు ప్రతి ఒక్కరు చేతిలో కనిపిస్తున్నాయి. అందుకు తగ్గటుగా మొబైల్ కంపెనీలు కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్రత్యేకతలతో ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ ‘వివో' ‘వివో ఎక్స్‌ప్లే 7’ పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తయారుచేస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. వివో ఎక్స్‌ప్లే 7 ఫోన్‌ను 10జీబీ ర్యామ్‌తో తీసుకొస్తున్నట్లు సమాచారం.

ఇదే గనుక నిజమైతే ప్రపంచంలోనే 10జీబీ ర్యామ్‌ కలిగిన తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే అవ్వనుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ ఫొటో ఒకటి ఆన్‌లైన్‌లో బయటకొచ్చింది. ఇక ఈ ఫోన్‌ ఇతర ఫీచర్లను చూస్తే.. 256జీబీ/512జీబీ అంతర్గత మెమొరీ, 4కే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే తదితర అధునాతన ఫీచర్లు ఉండనున్నాయి. అయితే ఫోన్‌ ఫీచర్లు, ధరల వివరాలను సంస్థ ఇంకా వెల్లడించలేదు.





Untitled Document
Advertisements