మార్పును ప్రజలు గుర్తించాలి : చంద్రబాబు

     Written by : smtv Desk | Tue, Jan 30, 2018, 04:26 PM

మార్పును ప్రజలు గుర్తించాలి : చంద్రబాబు

అమరావతి, జనవరి 30 : "మీరు మారినట్లు ప్రజలు గుర్తించాలి" అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశ౦లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రజలలో ప్రభుత్వం పట్ల సానుకూలత ఉందని అదే సానుకూలతను పార్టీ పరంగా మార్చుకోవాలన్నారు. నెలకోసారి గ్రామాభివృద్ధిపై సమావేశం జరపాలని, ప్రతి గ్రామంలో దళితవాడకు వెళ్లాలని, దళిత యువతతో మమేకం కావాలి. అలాగే బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతోనూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డిసెంబర్‌లో ప్రజలలో సంతృప్తి 57శాతం ఉండగా, జనవరిలో 62శాతానికి పెరిగిందన్నారు. మొత్తంగా ప్రజల నుండి 80శాతం సంతృప్తి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. అలాగని క్రమశిక్షణను ఉల్లంఘిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటివరకు చేయవలసిన పనులన్నీ చేశాం. ఇక మన ప్రవర్తనలోనే మార్పు రావాల౦టూ తెలిపారు.

Untitled Document
Advertisements