తొలి మూడు వన్డేలకు “మిస్టర్ 360” దూరం..

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 10:12 AM

తొలి మూడు వన్డేలకు “మిస్టర్ 360” దూరం..

డర్బన్‌, జనవరి 31 : టీమిండియా జట్టుతో ఆరు వన్డేల సిరీస్ ఆడనున్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అ జట్టు స్టార్ బ్యాట్స్ మెన్, ఏబీ డీవిలియర్స్ మూడు వన్డేలకు దూరమయ్యాడు. భారత్ తో జరిగిన మూడో టెస్ట్ లో ‘మిస్టర్ 360’ కుడి చేతికి గాయమైంది. దీంతో ఈ గాయం మానడానికి మరో రెండు వారాల సమయం పట్టవచ్చునని డాక్టర్లు చెప్పడంతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు డివిలియర్స్‌కు విశ్రాంతినిచ్చింది. కాగా సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఫిబ్రవరి 1న జరగనుంది.

Untitled Document
Advertisements