ఈ సినిమా హార్డ్ వర్క్ కి నా చెయ్యే నిదర్శనం: సమంత

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 10:28 AM

ఈ సినిమా హార్డ్ వర్క్ కి నా చెయ్యే నిదర్శనం: సమంత

హైదరాబాద్, జనవరి 31: మెగా హీరో రామ్ చరణ్ కి జోడిగా సమంత నటిస్తున్న చిత్రం 'రంగస్థలం'. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

అయితే, ఈ సినిమా షూటింగ్ లో భాగంగా కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇటీవలే రాజమండ్రి షెడ్యూల్ లో పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో హెవీ వర్క్ వల్ల సమంతకు చేయి నొప్పి కలిగిందట. అందుకు రిలీఫ్ కోసం ఈ సుందరి చేతికి కట్టు కట్టించుకుంది. ఈ సందర్బంగా ఆమె సోషల్ మీడియాలో.. 'చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. దీనికి నా చెయ్యే నిదర్శనం' అని తెలిపింది.





Untitled Document
Advertisements