నవయుగకు పోల 'వరం' పనులు..

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 10:40 AM

నవయుగకు పోల 'వరం' పనులు..

న్యూఢిల్లీ, జనవరి 31 : రాష్ట్ర ప్రభుత్వ కలల ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణ పనుల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. స్పిల్‌వే పనుల నిర్మాణంలో జాప్యం చేస్తున్న గుత్తేదారు సంస్థ టాన్స్‌ట్రాయ్‌ నుంచి 60సి నిబంధన ప్రకారం కొంత పనిని తప్పించి నవయుగ సంస్థకు అప్పగించడానికి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఆమోదముద్ర వేశారు. స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులను ఈ సంస్థ చేపట్టనుంది. మంగళవారం సాయంత్రం ఇక్కడి శ్రమశక్తిభవన్‌లోని ఆయన కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకమీదట నవయుగ సంస్థ ఉపగుత్తేదారు సంస్థగా కాకుండా ప్రధాన గుత్తేదారు సంస్థల్లో ఒకటిగానే స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ నిర్మాణ పనులు చేపట్టనుంది.

Untitled Document
Advertisements