చిరు చిన్నఅల్లుడి సినిమా షూటింగ్ షురూ..

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 10:55 AM

చిరు చిన్నఅల్లుడి సినిమా షూటింగ్ షురూ..

హైదరాబాద్, జనవరి 31: మెగా స్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ హీరోగా వెండితెరపై అలరించడానికి సిద్ధమయ్యాడు. రాకేశ్ శశి దర్శకత్వంలో కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ చిత్రంలో కల్యాణ్ కు జోడిగా మాళవిక నాయర్ నటిస్తోంది.

వారాహి చలన చిత్ర కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి, ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు. కీరవాణి కెమెరా స్విచాన్ చేయగా.. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. యోగేష్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.





Untitled Document
Advertisements