షూటింగ్ సమయంలో ఇద్దరం ప్రేమించుకున్నాం: రష్మిక

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 12:57 PM

షూటింగ్ సమయంలో ఇద్దరం ప్రేమించుకున్నాం: రష్మిక

హైదరాబాద్, జనవరి 31: తన అందంతో, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు 'చలో' చిత్రంతో పరిచయం కాబోతుంది కన్నడ నటి రష్మికా మండన్న. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా 'చలో' విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంది ఈ సుందరి.

'మొదటగా కన్నడలో 'కిరిక్ పార్టీ' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. ఆ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతోనే తెలుగులో నటించే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో నా పాత్ర భావోద్వేగాలు, ప్రేమతో కూడుకుంది. 'చలో'తో నాకు మంచి అవకాశాలు లభిస్తాయని అనుకుంటున్నాను.

ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 'కిరిక్ పార్టీ' మూవీ హీరో రక్షిత్‌ శెట్టితో లవ్‌లో ఉన్నాను. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో స్నేహం చిగురించి అది ప్రేమగా మారింది. త్వరలోనే పెళ్లి వార్త చెప్తాను' అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.

Untitled Document
Advertisements