కుర్రాళ్లకు నజరానా ప్రకటించిన బీసీసీఐ...

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 01:23 PM

కుర్రాళ్లకు నజరానా ప్రకటించిన బీసీసీఐ...

న్యూఢిల్లీ, జనవరి 30 : ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో దాయాది దేశమైన పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన భారత్ జట్టు పై ప్రసంశల జల్లు కురుస్తుంది. పాక్ పై ఎలా ఆడితే ప్రతి భారతీయుడు గర్వపడతాడో అలా ఆడి విజయం సాధించారు. కాగా ఈ విజయంతో ఫైనల్ కు చేరిన టీమిండియా జట్టు కుర్రాళ్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. అంతే కాకుండా వారు భారత్ చేరుకున్న తర్వాత ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం అని అధికారులు తెలిపారు. బీసీసీఐ ఆటగాళ్లకు ఎంత నజరానా ప్రకటించిందన్నది తెలియరాలేదు. మంగళవారం జరిగిన సెమీఫైనల్‌-2లో పాక్‌పై 203 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Untitled Document
Advertisements