రాహుల్ నల్ల"ధనం" సూట్..

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 02:09 PM

రాహుల్ నల్ల

షిల్లా౦గ్, జనవరి 31 : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వేసుకున్న సూట్ ఇప్పుడు చర్చనీయా౦శమైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేఘాలయ వెళ్ళిన రాహుల్.. సెలబ్రేషన్ ఆఫ్ పీస్ పేరుతో ఓ మ్యూజిక్ షోకు రూ.70 వేల విలువైన జాకెట్ వేసుకొని వచ్చారు. దీనిని గమనించిన మేఘాలయ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ మేరకు మేఘాలయ బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో.. "అవినీతితో మేఘాలయ రాష్ట్ర ఖజానా నుంచి పీల్చేసిన "నల్ల"ధనంతో ఈ జాకెట్ కొన్నారా.? అంటూ ట్వీట్ చేసింది.

కాగా కాంగ్రెస్ పార్టీ యువ ఓటర్లకు చేరువయ్యేందుకు ఈ సంగీత విభావరిని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. మన దేశంలో మనమంతా కలిసికట్టుగా ఉంటేనే బలంగా ఉంటామన్నారు. మన వైవిధ్యభరితమైన సంస్కృతి, విభిన్న భాషలు, విభిన్న ఆలోచనలే భారతదేశ బలమని తెలిపారు. అయితే గతంలో మోదీ అని రాసి ఉన్న సూటును ధరించి మోదీ ఓ సమావేశంలో పాల్గొనగా.. రాహుల్ "సూట్ - బూట్‌కీ సర్కార్" అంటూ ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements