త్రిపాత్రాభినయంలో కనిపించబోతున్న మాస్ మహారాజా..!

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 02:29 PM

త్రిపాత్రాభినయంలో కనిపించబోతున్న మాస్ మహారాజా..!

హైదరాబాద్, జనవరి 31: వెండితెరపై హిట్ కాంబినేషన్లలలో ఒకటి రవితేజ - శ్రీనువైట్ల కాంబినేషన్. ఇప్పటికే వీరిద్దరూ కలిసి చేసిన 'వెంకీ', 'దుబాయ్‌ శీను' సినిమాలు మంచి విజయాన్నిసాధించాయి. మరోసారి శ్రీనువైట్ల మాస్ మహా రాజా కోసం కథను సిద్ధం చేశారు. ఈ చిత్రానికి 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' అనే పేరు పెట్టబోతున్నారట.

టైటిల్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇదే నిజమైతే ఆయన సరసన ముగ్గురు కథానాయికలు ఎవరు నటించాబోతున్నరనేది తెలియాల్సివుంది. ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. ఇంకా పూర్తి వివరాలు త్వరలో చిత్రబృందం ప్రకటించనుంది. ప్రస్తుతం రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు' సినిమా విడుదలకు సిద్ధమైంది.

Untitled Document
Advertisements