'భాగమతి' విజయానికి కారణం సమిష్టి కృషే: అనుష్క

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 03:45 PM

'భాగమతి' విజయానికి కారణం సమిష్టి కృషే: అనుష్క

హైదరాబాద్, జనవరి 31: స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'భాగమతి' చిత్రం ఈ నెల 26న విడుదలై౦ది. అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్ళను రాబడుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అనుష్క మాట్లాడుతూ.. 'భాగమతి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా వుంది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను బాగా చేస్తానంటూ అంతా నన్ను అభినందిస్తుంటారు. నిజానికి ఇది సమీష్టి కృషి .. మంచి టీమ్ కుదరడం వల్లనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతూ ఉంటాయి. ఇదే విషయాన్ని 'భాగమతి' మరోసారి నిరూపించింది. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లందరికీ .. ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్' అంటూ చెప్పుకొచ్చింది.

Untitled Document
Advertisements