మాజీ క్రికెటర్ తండ్రి కన్నుమూత..

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 03:45 PM

మాజీ క్రికెటర్ తండ్రి కన్నుమూత..

న్యూఢిల్లీ, జనవరి 31: భారత మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లి తండ్రి గణ్‌పత్‌ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని కాంబ్లి తన ట్విటర్‌ ద్వారా తెలిపారు. “ ఇంత వరకూ నాకు అండగా నిలిచి, పోత్సహించి, నేను క్రికెట్‌ ఆడేందుకు స్ఫూర్తినిచ్చిన నా తండ్రి గణ్‌పత్‌ ఇక లేరు. ఈ రోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. మిస్‌ యూ. థాంక్యూ నాన్న. లవ్‌ యూ. మీ కుమారుడు వినోద్‌.” అంటూ కాంబ్లి తన తండ్రి పట్ల ఉన్న ప్రేమను చాటారు.

అంతే కాకుండా అతని తండ్రికి సంబంధించిన కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. 1991 అక్టోబర్ లో పాకిస్తాన్ మ్యాచ్ తో అంతర్జాతీయ కెరీర్ ఆరంభించిన వినోద్‌ కాంబ్లి భారత్ తరపున 17 టెస్టులు, 107 వన్డేలు, ఆడారు.

Untitled Document
Advertisements